![](https://ifocusmission.org/wp-content/uploads/2023/04/iFocus-Journey-1024x424.jpeg)
ఈరోజున మనమందరం భాగస్వాములైన ఈ ఐఫోకస్ మిషన్– నవంబర్ 2005 లో కేవలం ఒకే ఒక వ్యక్తితో మొదటి అడుగు వేసింది. మెల్లగా ఒకరి తర్వాత ఒకరు అడుగులు కలుపుతూ ఆ సంఖ్య ఈరోజు పదులు, వందలు దాటి వేలలోకి చేరింది. ప్రపంచం నలుమూలల నుండీ అన్ని వర్గాల వ్యక్తులు ఈ ప్రయాణంలో మనతో పాటు నడుస్తున్నారు. ఇక్కడ దొరికిన వారి ఆత్మీయులైన సహచరులతో తమ అంతరంగ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తీ ఒక ప్రత్యేకం. కానీ, తమ తోటివారితో ఎన్నో సామీప్యాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణం స్వచ్చందం. రమ్మని, ప్రయాణంలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిస్తారు కానీ, ఇంక కొనసాగలేము అనుకుంటే ఎవరి ఒత్తిడీ ఉండదు. ఇక్కడ అందరూ స్వతంత్రులే. వారు ఎంచుకున్న రంగాలలో ఎదగడానికి, అత్యున్నత స్థాయికి చేరడానికి ఐఫోకస్ మిషన్ ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. తగిన సదుపాయాలు, పరిస్థితులను అందిస్తుంది. ఇది ఎలాంటి సత్వర పరిష్కారాలను అందించదు. వాగ్దానాలు చేయదు. కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నవారు, వారి అభివృద్ధి యొక్క ఫలాలను ఆస్వాదిస్తారు. ప్రస్తుతం ఈ మిషన్ యొక్క అనేకమైన ప్రయోజనాలకు సాక్ష్యంగా నిలిచేవారి సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ఈ ప్రయాణంలో కొనసాగడం ద్వారా, నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు నేడు సమాజంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు.
ఇది ఐఫోకస్ మిషన్ యొక్క పరిణామక్రమం. మన ఛీఫ్ కో ఆర్డినేటర్ శ్రీ వాసుదేవ శర్మ గారు తనను తాను ఈ ప్రయాణంలో మొదటి వ్యక్తిగా పిలిపించుకోవడానికి ఎంతో గర్వపడతారు. ఈ గమ్యానికి మార్గం యొక్క పునాది– సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి చేతులమీదుగా వేయబడింది. దృఢమైన సంకల్పంతో సద్గురు, ఆయన ప్రారంభించిన ఈ మిషన్ కొనసాగవలసిన దారిని ఆయనే నిర్దేశించారు. ఇప్పటికీ అన్నింటిలో, అందరికీ స్పూర్తినిస్తూనే ఉన్నారు. ఐఫోకస్ మిషన్ ప్రారంభించక మునుపే, శ్రీ శర్మగారు సద్గురు శివానందమూర్తి గారికి పరమ భక్తులు. సద్గురు తమకు ఎలా మార్గనిర్దేశనం చేసారో, తాను ఉత్తేజం పొందడానికి ఎలా సహాయం చేసారో, శ్రీ శర్మ గారు ఇప్పటికీ చాలా గర్వంగా, ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ శర్మగారు ఏవిధంగా అయితే, తమను తాము కొత్తగా ఆవిష్కరించుకున్నారో, ఐఫోకస్ ది కూడా అదే విధానం.ఐఫోకస్ మిషన్, ఉన్నతికి ఆటంకం కలిగించే అంశాలను ఛేదించడంలో సహాయపడుతుంది. సభ్యులను సాధికారమైన జీవనం వైపుగా నడిపిస్తుంది.
ఇక్కడ ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిషన్ సభ్యులందరూ వ్యక్తిగత బాధ్యత తీసుకుని, సామాజిక సాధికారత కొరకు తమ వంతు సహకారం అందిస్తారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలలో— రోడ్ షోలు, మైత్రీవారధి, జయప్రద , ఓటర్ ఫోకస్, స్టూడెంట్ ఫోకస్, ట్రాఫిక్ ఫోకస్, గో గ్రీన్ గణేశ, మీట్ ద ఎలైట్ సమావేశాలు, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వంటివి మచ్చుకి కొన్ని.
ప్రతి వేడుకలోనూ సభ్యుల సహకారం, వారి భాగస్వామ్యం — వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, వారి ప్రవర్తనను, వైఖరిని చక్కగా మలుచుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, వారి వ్యక్తిగత విలువలను తీర్చిదిద్దుకోవటానికి, ఆలోచనలను సరి అయిన మార్గంలో పెట్టడానికి, సరి అయిన చోట వాటిని మరింత క్రమపద్ధతిలో ప్రదర్శించడానికి —తోడ్పడుతుంది. ఎవరైతే ఈ ప్రయాణంలో చేతులు కలుపుతారో, వారు వారియొక్క సామర్ధ్యాన్ని గుర్తించి, వాటిని సాధించే దిశగా అత్యుత్తమమైన అడుగు వేయగలుగుతారు. మనకు సలహాలు చెప్పడానికి, మన బలాలను, బలహీనతలను గుర్తించి, మనల్ని మరింత సానబట్టేందుకు ఇక్కడ ఎంతోమంది మెంటార్స్, నిపుణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. ఇంటర్న్ షిప్ లూ, ప్రోజెక్టులూ, అప్రెంటిస్ షిప్, ఇలా ఎన్నో అవకాశాలు, విస్తృతమైన కెరీర్లకు, స్టార్ట్ అప్స్ లను స్థాపించడానికి వీలు కల్పిస్తున్నాయి.
ఐఫోకస్ మిషన్, వివిధ అంశాలలో సభ్యులు సాధించిన విజయాలకు అవార్డులు ప్రకటిస్తుంది. ఉత్ఠాన, యువహిత, సుజనహిత, ధీర కిసాన్, ధీర ఫేమిలీ, విశిష్ట కర్మచారి, విశిష్ట సంస్థ మొదలైన అంశాలలో, వారి వారి సమర్థత ప్రకారం, ఎంపిక చేసినవారికి అవార్డులు ఉంటాయి.
ఇFఒచుస్ మిషన్ నాలుగు విభాగాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది – సుశ్రూష, సుభద్రత, సుస్వతంత్ర మరియు సుజనహిత. ఇవి వరుసగా విద్యార్థులు, నిపుణులు, వ్యవస్థాపకులు మరియు సమాజానికి మేలు చేయాలని తపించేవారి కోసం ఉద్దేశించబడింది. వర్క్ షాప్ లు, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లు, పర్సనల్ కౌన్సెలింగ్, అసెస్మెంట్లు— ఉత్తమమైన స్థాయికి తీసుకురావడానికి నిర్వహించబడతాయి.
ఆసక్తి ఉన్నవారు వివిధ స్థాయి వర్క్ షాప్ లలో చేరడం ద్వారా జీవితకాల సభ్యులుగా మారతారు. తర్వాత ఐఫోకస్ లో శక్తివంతమైన భాగస్వాములుగా మారేందుకు ఉన్నతస్థాయి వర్క్ షాప్ లలో కొనసాగుతారు. ఇక్కడ నేర్చుకునే ప్రక్రియ అంతా, అందరినీ కలుపుకుంటూ, Live sessions and interactive పద్ధతిలో జరుగుతుంది. సభ్యులు మిషన్ ప్రతిజ్ఞలో చెప్పినట్టుగా, ఉత్తమ విలువలతో, ఉత్తమ ప్రవర్తనతో జీవించడానికి సంసిద్ధులౌతారు.
ఆన్లైన్ పద్ధతిలోకి వెళ్లడం ద్వారా ఐఫోకస్ మిషన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి కోవిడ్ 19 సరళతరం చేసింది. విదేశాల నుంచి కూడా వేలాది మంది సభ్యులను చేర్పిస్తూ వందల సంఖ్యలో బ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఐఫోకస్ మిషన్— విద్యార్థులు, వృత్తినిపుణులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు, సినీ ప్రముఖులు, ప్రచురణకర్తలతో కూడిన విభిన్న వయోవర్గాలతో భౌతికంగా అనుసంధానించబడిన అతిపెద్ద నెట్వర్క్గా ఆవిర్భవించింది.
2022 మే 21వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ భగత్లో ఐఫోకస్ మిషన్ తన సొంత భవనం ‘సుజనాలయ’ ను ప్రారంభించడం గొప్ప విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కంచి మఠానికి చెందిన పూజ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు విచ్చేసి, మిషన్ను ఆశీర్వదించారు.
ఐఫోకస్ మిషన్— సమర్థత, సమగ్రత మరియు భారతీయత యొక్క ఆదర్శాలను వ్యాప్తి చేయడం ద్వారా తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఐ ప్రసారా— ఐఫొకస్ మాసపత్రిక, “ఒకరికోసం ఒకరు” అనే సందేశాన్ని అందించడమే ఉద్దేశ్యంగా, స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ, “మైత్రీ వారధి” సందర్భంగా విడుదల కాబోతోంది.